![]() |
![]() |

"క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ" అంటూ రీసెంట్ గా ప్రసారమైన షోలో బుల్లితెర నటీనటులంతా కూడా సుమకి సన్మానం చేసారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఆడియన్స్ ని తన యాంకరింగ్ తో అలరిస్తున్నందుకు ఆమెను అందరూ కలిసి ఘనంగా సత్కరించుకున్నారు. "ప్రొడ్యూసర్ లు హీరోల డేట్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తారు..సినిమా స్టార్ట్ అవకముందే ఆ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ కోసం మీ దగ్గర డేట్స్ తీసుకుంటున్నారు మేడం ఇప్పుడు..మీరు హీరోలకు ఎంత సెంటిమెంట్ అంటే మీ చేత్తోనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేస్తేనే మూవీ హిట్ అవుతుంది అన్నంతగా ఇండస్ట్రీ మీ మీద బేస్ ఐపోయింది" అని రాంప్రసాద్ చెప్పేసరికి "నువ్వు ఇంత మాట్లాడాక వాళ్లంతా నన్ను పిలవరేమో" అని భయమేస్తోంది అని కౌంటర్ వేసింది సుమ.
తర్వాత ఆది వచ్చి "బేసిక్ గా ఒక సినిమా జనాలకు నచ్చాలంటే అందులో కంటెంట్ ఉండాలి...కానీ ముందు ఆ సినిమా జనాల్లోకి వెళ్లాలంటే సుమ గారి యాంకరింగ్ ఉండాలి..ఒక చిన్న సినిమా ఆవిడ ప్రమోట్ చేస్తే అది పెద్ద సినిమా అవుతుంది..అదే ఒక పెద్ద సినిమాను ఆవిడే ప్రమోట్ అది పాన్ ఇండియా సినిమా అవుతుంది..సుమ గారు అంటే యాంకరింగ్..యాంకరింగ్ అంటే సుమ గారు..ఆవిడ తర్వాతే ఎవరైనా" అని చెప్పాడు.ఇక నటి యమున మాట్లాడుతూ " ఒకప్పుడు ఆర్టిస్ట్ నటన కంటే యాంకరింగ్ ని బాగా తక్కువగా చూసేవారు. కానీ అసలు విషయం చెప్పాలంటే యాంకరింగ్ కి మీరు వచ్చాకే స్టార్ ఇమేజ్ వచ్చింది...మీకు స్క్రిప్ట్ తో పని లేదు. స్పాంటేనిటీ మీలో ఉన్న ప్లస్ పాయింట్" అని చెప్పింది. ఆ తర్వాత నటీనటులంతా కూడా సుమ గురించి వాళ్ళ మాటలు చెప్పారు.
![]() |
![]() |